విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హై స్కూల్ చదువు పూర్తిచేయని ఒక సాదారణ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పోలీసు కమిషనర్ కొడుకు హత్యని ఆక్సిడెంట్ కేసుగానే క్లోజ్ అయ్యేలా చేయడం ఈ చిత్ర కధాంశం. చూస్తూ చూస్తూ ఉండే మనసు చూసే వస్తువునే తలుస్తుందట అలాగే ఎప్పుడు కేబుల్ టివి యజమానికూడా సినిమాలు చూస్తూ తెలివితేటలతో తన కుటుంబం చేసిన హత్యని ఆక్సిడెంట్ కేసుగా చూపుతాడు.

కనిపించేదంతా దృశ్యంగా ఉంటే అందులో మర్మం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సినిమాల ద్వారా పోలీసుల దృష్టి ఎంతవరకు ఉంటుందో అవగాహనా పొందిన ఒక సినీ వీక్షకుడి నుండి వచ్చిన సస్పెన్స్ మూవీ దృశ్యం. కనిపిస్తున్నాయి కదా అని కానివి కోరుకుంటే కాయమే కోల్పోతామని మనసుని హెచ్చరించే దృశ్యమానందృశ్యంలో కనిపిస్తుంది. అన్ని అందుతుంటే సమయానికి సౌకర్యాలు సమకురుతూ సహజంగా ఇతరులను కూడా సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించేవారు ఉంటారు. జీవితం విలువ తెలియకుండానే సౌకర్యాలు ఎక్కువైతే వచ్చే అనర్ధాలు జీవితాన్ని కోల్పోయేవరకు సాగుతాయి.

ఇక కధలోకి వెళ్తే రాజవరంలో రాంబాబు కేబుల్ టివి నిర్వహిస్తూ ఉంటూ, కేబుల్ ఆఫీసులో సినిమాలు చూస్తూ ఉంటాడు.రాంబాబు అతని భార్య ఇద్దరు ఆడపిల్లలతో ఆఫీసుకి దూరంగా కాపురం ఉంటూ ఉంటారు. అంజు ఇంటర్ చదువుతుంటే, చిన్నమ్మాయి స్కూల్ కి వెళుతూ ఉంటుంది. అంజు కాలేజీలోనే కమిషనర్ కొడుకు వరుణ్ చదువుతూ ఉంటాడు. ఇంటి సభ్యులతో గడుపుతూ సరదాగా కేబుల్ ఆఫీసులో సినిమాలు చూస్తూ గడిపే మధ్యతరగతి వ్యక్తి రాంబాబు జీవితంలోకి వచ్చే విషాదానికి కారణమే కమిషనర్ కొడుకు వరుణ్ కోరిక.

ఆకర్షణలకు లొంగితే అది జీవితాలతో ఆడుకుంటుంది.

అతి చాదస్తపు అలవాట్లు ఇంటిపట్టున ఉండేవారిని ఇబ్బంది పెడితే, మితిమీరిన సౌకర్యాలు సమయం కానీ సమయంలో కూడని విషయాలవైపు తీసుకువెళతాయి. తండ్రి అనుమతితో కాలేజీ టూర్కి వెళ్ళిన అంజు బట్టల మార్చుకునేటప్పుడు వీడియో చిత్రీకరించి, సదరు వీడియోతో అంజుని తన కోరిక తీర్చవలసినదిగా వరుణ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. గతిలేని అంజు అమ్మ జ్యోతితో చెబుతుంది. జ్యోతి అంజులు కల్సి వరుణ్ కి నచ్చజెప్పబోతే అతను జ్యోతినే కోరికను తీర్చమని అంటాడు, ఆ మాట విన్న అంజు అతని తలపై బలంగా కొట్టగానే వరుణ్ మరణిస్తాడు.

వరుణ్శవాన్ని వారు పాతిపెట్టి రాంబాబు వచ్చిన తరువాత విషయం చెబుతారు. అక్కడ నుండి రాంబాబు వేసే అడుగులు పోలీసులకు అంతుబట్టదు. వరుణ్ వాడిన కారు దొరకగానే చిత్రం ఇంకా సస్పెన్స్ గా సాగుతుంది. చివరకి కుటుంబం మొత్తాన్ని ఇంట్రాగేషణ్ చేసిన ప్రయోజనం ఉండదు. కమిషనర్ రాంబాబుని రిక్వెస్ట్ చేసిన పిదప జరిగిన విషయం చెప్పి, వారి కొడుకు చేసిన తప్పుని తెలియజేస్తాడు.

ధర్మంగా తనపని తాను చేసుకుంటూ ఉండే సాదారణ వ్యక్తి చేతిలో నేర్చుకునే వయసులో నేర్వడం మాని పెడద్రోవ పట్టిన యువకుడు గతిని కనుక్కోవడానికి కమిషనర్ వల్ల కూడా కాకపోవడం ఈ చిత్రంలో విశేషం. ఆకర్షణకు గురై పరిది దాటి ప్రవర్తించిన యువకుడి జీవితం ముగిస్తే, ఆ ప్రభావానికి ఒక కుటుంబం ఆవేదనకు గురిచేసింది, దృశ్యం చిత్రంలో.

చిన్న పిల్లలకు ఖరీదు అయిన స్మార్ట్ ఫోను ఇచ్చినా, బంతి ఇచ్చినా ఒకేలాగా విసిరేస్తూ, కింద మీద పడేస్తూ ఆడుకుంటాడు. చల్లని నీరు వేడి నీరు అయినా నిప్పు అయినా ముట్టుకుంటాడు. జీవితం విలువ తెలియనివారు ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు, ఒక్కోసారి వారి జీవితం కోల్పోతారు. అలాంటి కోవలోకే వరుణ్ వెళ్ళాడు.

ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్, అతని భార్య జ్యోతిగా మీనా, వారి పెద్ద కూతురు అంజుగా (కృత్తిక జయకుమార్) చిన్న కూతురుగా ఎస్టర్, హెడ్ కానిస్టేబుల్ గా పరుచూరి వెంకటేశ్వరరావు, కమిషనర్ గా నదియా, కమిషనర్ భర్తగా నరేష్, వారి కొడుకు వరుణ్ గా రోషన్ బషీర్, కానీస్టేబుల్ వీరభద్రంగా రవి కాలే మొదలగు పాత్రల్లో ఇతరులు నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్