aviivi TeluguCinema

ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్

ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్

ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్ నటిస్తున్న తెలుగు లేటెస్ట్ మూవీ నేమ్ చెక్ ఈ తెలుగు సినిమా ఈ నెలలో విడుదల కానుంది , ట్రైలర్ ఆకట్టుకునేలాగా ఉంది.

ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్ వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే ఆరంభమై షూటింగ్ జరుగుతున్న చెక్ తాజా తెలుగు సినిమాలో నితిన్ కధయనయుకుడిగా నటిస్తున్నారు. నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా వారియర్ నటిస్తున్నారు.

ఒక చెస్ ఆటగాడి కధే ఈ చెక్ తెలుగు సినిమా. ఐతే తెలుగు సినిమాతో మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ యేలేటి ఈ చెక్ తెలుగు సినిమాకి డైరక్షన్ చేస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత.

ఈ చెక్ తెలుగు సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీశర్మ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఖైదీగా నితిన్‌ జైలులో శత్రువులపై పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 

‘రాజును ఎదురించే దమ్ము  సిపాయికి ఉందా’ అంటూ విలన్‌ అంటే, ‘యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి’ అంటూ నితిన్ తిరిగి‌ సవాల్‌ విసిరే డైలాగ్‌ ఆసక్తిని పెంచుతుంది. దేశద్రోహిగా నేరారోపణ ఎదుర్కొంటున్నఅతడు చదరంగం ఆటతో ఎలా నిర్ధోషిగా బయటపడ్డాడనే ఇతివృత్తంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *