భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం.

కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం.

మన భారతంలోని ధర్మరాజు మాటకు విజయుడుగా కీర్తి పొందిన అర్జునుడు కట్టుబడి ఉంటాడు. భారతంలో అర్జునుడు ధర్మరాజు మాటను అతిక్రమించకుండా నడుచుకున్నాడు. అని పెద్దలు చెబుతూ ఉంటారు.

భీముడు అత్యంత బలశాలి. భారతంలో భీముడు, దర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు వంటి అత్యంత బలమైనవారిని మట్టికరిపించాడు. అలాంటి అతి బలశాలి అయిన భీమసేనుడు కూడా. ధర్మరాజు మాటంటే, ఆమాటకు కట్టుబడి ఉంటాడు.

ఇక నకుల సహదేవులు కూడా చాలా ప్రతిభావంతులు. అత్యంత ఆకర్షణీయమైన రూపం గలవారు. ఈ రోజులలో అదే ప్రధానంగా ఉంది. ద్వాపరయుగంలో అటువంటి అందగాళ్లు అయిన నకుల సహదేవులు కూడా భారతంలోని ధర్మరాజు మాటకు ఎదురుచెప్పరని అంటారు.

ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే? భారతంలో ధర్మరాజు అతని అనుయాయులు వనవాసం చేశారు. అలా పాండవవనవాసం పూర్తయ్యాక, వనవాసం పూర్తి అయ్యిందని అంగీకరించవలసినది దుర్యోధనుడే కదా…

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

దుర్యోధనుడుకు ధర్మరాజు విరోధి. కానీ వనవాసం పూర్తి అయ్యిందనే మాట భారతంలో ధర్మరాజు చెప్పాకా మాత్రమే, దుర్యోధనుడు అంగీకరించాడని పెద్దలు చెబుతారు.

విరాటరాజు తనతోపాటు సమానంగా సింహాసనంపై కూర్చునే అవకాశం ఒక్క ధర్మరాజుగారికే ఇచ్చారని పెద్దలంటారు. ధర్మరాజు ఎక్కడుంటే, అక్కడ పాడిపంటలు పెరుగుతాయని అంటారు.

పాండవులలో భీమార్జునులు, నకుల సహదేవుల మరణిస్తే, తిరిగి వారు పునర్జీవులయ్యింది… ధర్మరాజు గారి ధర్మము వలననే అంటారు.

శ్రీకృష్ణపరమాత్మ పరబ్రహ్మమే అయి ఉన్నాడు. కానీ కృష్ణుడుగా ధర్మరాజుకు నమస్కారం చేస్తాడు. కురుక్షేత్రం యుద్ధంలో పాండవులు గెలిచారు. అలా పాండవులు గెలవడానికి ప్రధాన కారణం ధర్మరాజు ధర్మదీక్ష అని అంటారు.

ఇలా మన భారతంలో ఎవరి శక్తి ఎంతటిది అయినా, ధర్మరాజు ధర్మదీక్ష ప్రధానకారణం అయితే. ధర్మరాజు ధర్మనిరతి చాలా గొప్పగా చెబుతారు.

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి చెప్పే తెలుగు మూవీ?

ఎందుకు ధర్మరాజు గారి గురించి చెప్పాలంటే?

ఎవరైనా మూవీ వాచ్ చేస్తే, అందులో పదే పదే చెప్పబడిన డైలాగ్ ఎక్కువమంది నోట్లో నానుతుంది.

ఏదైనా ఒక మూవీలో పదే పదే వచ్చిన మ్యూజిక్ ఎక్కువమంది నాలుకపై నాట్యం చేస్తుంది.

మరేదైనా తెలుగు మూవీలో బాగా చిత్రికరీంచిన దృశ్యాలు, ఎక్కువమంది మదిలో గూడు కట్టుకుంటుంది.

అలాంటి తెలుగు మూవీ ఏ విషయం హైలెట్ చేస్తే, ఆవిషయం ఎక్కువమంది మనసులో మెదులుతూ ఉంటుంది.

మరి భీమ సేనుడు గురించే బలంగా చూపితే, బలం చాలనుకుంటారు. కర్ణార్జుల గురించే చూపితే, ఏదో ఒక విద్య చాలనుకుంటారు.

మనసును ఆకట్టుకోవడానికి ఏదో బలమైన అంశము ఉండాలి. కానీ ఆ అంశము ధర్మము ప్రధానమని చూపితే, విద్యపై పెరుగుతున్న ఆసక్తి, ధర్మమువైపు కూడా తిరిగి చూస్తుంది.

అందుకే మూవీలలో ధర్మరాజు గారిని కేవలం ఒక పాత్రగా కాకుండా, ప్రధాన పాత్రలను ప్రభావితం చేస్తున్న పాత్రగా తెరపై కదిలితే, అది ఆమూవీకే మెరుగైన మాణిక్యంగా మారుతుంది.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

సతీ సుకన్య తెలుగుపాత సినిమా

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

లక్ష్మీ కటాక్షం అలనాటిమేటి చిత్రము

కలసి ఉంటే కలదు సుఖం తెలుగు చలన చిత్రం

అమ్మ అమృతం కన్నా మిన్న

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *