నీకన్ను నీలిసముద్రం అనే ఉప్పెన పాట దారిలో సినిమా కూడానడుస్తుంది. ఉప్పెన కూడా హిట్ మార్గం పట్టింది.
కొత్తదనం కొట్టిచ్చినట్లు కధనం ఉంటే, సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని గతంలో తెలుగు ప్రేక్షకులు రుజువు చేసారు. ఇప్పుడు మరొకసారి ఉప్పెన సినిమాను ప్రేక్షకులు అలాగే ఆదరిస్తున్నారు.
మనవ సంబంధాలు కుల మతాలతో ముడిపడి ఉంటే, అవి మనసుపై బలమైన ప్రభావం చూపుతాయి. అలంటి మనిషి మనసుపై ప్రభావం చూపే అతి పెద్ద విషయం ప్రేమ. ఇది అందరికి లభిస్తుంది. కానీ కొందరికి కష్టం మీద లభిస్తుంది. అలాంటివే సమాజంలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు.
పుట్టిన ప్రతి ప్రాణికి తోడూ కూడా ఎక్కడో పుట్టి ఉంటుంది. అలాంటి తోడూ కొందరికి సులువుగా దొరికితే, కొందరికి కష్టంతో లభిస్తుంది. ఆ తోడుపై ఉండే ఆరాటం, కలిగే ప్రేమ కధాంశాలు అందరిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే మనసుకు ప్రేమ అంటే ఇష్టం.
కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన మూవీ ఉప్పెన. ఇది చాలామందిలో ఆసక్తిని కలిగించింది. విడుదల అయ్యి అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేమ కధంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ హిట్ అయ్యింది.
మెగా హీరో వైష్ణవ్‌తేజ్ కు మంచి హిట్ లభించింది. దర్శకుడు బుచ్చిబాబుకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పుకోవచ్చు. కరోన కారణంగా ధియేటర్ కు వెళ్ళని ప్రేక్షకులు ఒటిటి ప్రసారాలు కోసం వైట్ చేస్తుంటే, దానికి మార్చి నేలాఖురు వరకు వెయిట్ చేయాల్సిందేనని ఇసమాచారం.