శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ

శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది.

శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి.

ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి గంటలు, అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మా,పంచవన్నెల చిలక నిన్ను పాటలు కూడా ఆకట్టుకుంటాయి.

ఇక శుభాకాంక్షలు తెలుగు మూవీ కధలోకి వెళ్తే…

స్టీఫెన్ క్రైస్తవ మతానికి చెందినవాడు. సీతారామయ్య హిందూ మతానికి చెందినవాడు. ఒకేవీధిలో రెండు కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటారు. ఇంకా ఈ రెండు కుటుంబాల సభ్యుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంటుంది.

ఆ కుటుంబాలలో అబ్బాయిలు మోసెస్, బలరామయ్యలు కూడా మంచి స్నేహంగా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో రాబర్ట్(మోసెస్ తమ్ముడు), జానకి(బలరామయ్య చెల్లెలు) ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఈ రెండు కుటుంబాలు వీళ్ళ ప్రేమను అంగీకరించరు.

దాంతో వీరిద్దరూ దూరంగా పారిపోయి పెళ్ళి చేసుకుంటారు. ఇక అప్పటినుండి ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొంటుంది.

25 సంవత్సరాల తర్వాత స్టీఫెన్, బలరామయ్యల కుటుంబాలను ఏకం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతనే చందు. ఆక్రమంలో చందు గోపి అనే తన స్నేహితుడితో పాటు ఆ ఊరు వచ్చి తను రాబర్ట్, జానకిల కొడుకునని అందరితో చెబుతాడు.

వాళ్ళకి ఇల్లు దొరకని పరిస్థితులలో నాదబ్రహ్మం అనే వ్యక్తి మాత్రం వాళ్ళను పిలిచి తన ఇంట్లో ఉండమంటాడు. ఆ తర్వాత చందు నెమ్మదిగా విడిపోయిన ఆ ఇద్దరి కుటుంబాలతో పరిచయం పెంచుకుంటాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఒకసారి స్టీఫెన్, సీతారామయ్య భార్యలిద్దరూ చందుకు పెళ్ళి చేయాలని చూస్తారు. అయితే వారిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చందు కోసం పెళ్ళి సంబంధం తెస్తారు. వాళ్ళిద్దరి బారినుంచి తప్పించుకోవడం కోసం చందు తనకి ఇదివరకే నిర్మలా మేరీ అనే అమ్మాయితో పెళ్ళి అయిందని అబద్ధం చెబుతాడు.

అయితే ఆ అబద్దం నిజం చేస్తూ ఒక సన్నివేశం కధ మలుపు తిప్పుతుంది. ఉన్నట్టుండి నిర్మలా మేరీ అనే పేరుతో ఒక అమ్మాయి ఇతని కోసం వచ్చి తానే అతని భార్య అని చెబుతుంది.

చందు చెప్పిన అబద్దం నిజం చేస్తూ, వచ్చిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? చందు నందిని ప్రేమకధ ఏమయ్యింది? ఈ ప్రశ్నవలకు సమాధానాలు చివరకి ఏమవుతుందో సినిమా చూడాల్సిందే…

శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ
శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ

ఫ్యామిలీ హీరో జగపతిబాబు ప్రేక్షకులను మెప్పిస్తే, పాటలు అందరినీ అలరిస్తాయి. అందాల తార రాశి, జగపతిబాబుల మద్య ప్రేమ, జగపతిబాబు, రవళిల మద్య జరిగే సన్నివేశాలు కధను కొనసాగిస్తాయి.

శుభాకాంక్షలు తెలుగు మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించినది.

తెలుగురీడ్స్ బ్లాగ్

తెలుగురీడ్స్ హోమ్