Bhakti Cinemalu TeluguCinema

శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ ఆనాటి భక్తి సినిమా గురించి

శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ అలనాటి మేటి తెలుగు సినిమాలలో ఒక్కటి ప్రహ్లాదుడికి తల్లిగర్భంలో ఉండగానే జ్ఙానం అందించిన నారదుడు అజ్ఙానం పొందడం?

ఈ పోస్టులో ఈ చిత్రమైన విషయం గురించి రీడ్ చేయండి… ఇంకా ఈ తెలుగు మూవీ గురించి… చదవండి

మాయ మహామాయ అంటూ లోకంలో పలు రకాలు పలువురు ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. ఈ మాయ అంటే సంసారం, సంసారమంటే మాయ అని తాత్వికులు అంటారు.

అలాంటి మాయలో మనిషి జీవన సాగిస్తూ ఉంటాడని అంటారు. అటువంటి మాయ అందరినీ ఆడిస్తుంటే, ఆమాయను ఆడించేవాడు ఒకడు ఉన్నాడు. వాడే శివుడని శైవులు, కేశవుడని వైష్ణువులు భావిస్తారు.

కానీ మాయ మాత్రం వారి అధీనంలోనే ఉంటుందని కొందరంటారు. అఇద్దరూ పరమాత్మ స్వరూపులేనని కొందరంటారు..

కాదు ఇద్దరూ కలసి లోకంలో గర్వం పొందినవారి గర్వమనుస్తారని కొందరంటారు.

ఇలా ఈ సంసారమనే మాయ మానవునికి సహజం అయితే ఇటువంటి సంసారమే నిత్యం నారాయణమంత్రం జపించే నారదమునికే ఏర్పడితే, అది విడ్డూరమనే చెప్పాలి.

ఎందుకంటే నారదుడు ఒక మహర్షి… అంతే కాదు త్రిలోకాలు సంచరిస్తూ ఉంటాడు. ఇంకా… నిత్య నారాయణ నామం జపిస్తూనే ఉంటాడు.

చనిపోయేముందు నారాయణ అని పాపముల పోగొట్టుకున్నవారు ఉన్నారు. మరి అటువంటప్పుడు నిత్యం నారాయణ నామం జపించే నారదునికి సంసారం ఎలా ప్రాప్తించింది… ఇది మరీ విడ్డూరంగానే ఉంది..

అలాంటి విడ్డూరం నారద సంసారం అనే నాటకం ద్వారా పెద్దలకు పరిచయమే… అది సినిమాగా కూడా రూపొందింది.. అదే శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ. కృష్ణమాయను అధిగమించడం చాలా కష్టమే… అంటారు.

బాల్యంలోనే అమ్మకు పదునాలుగు భువనబాండములను తన నోటిలోనే చూపించిన శ్రీకృష్ణ పరమాత్మకు సాద్యం కానిదేముంది? నారదమహర్షి ఎలా శ్రీకృష్ణమాయలో పడ్డాడు..? సినిమా చూస్తే అవగతం అవుతుంది. ఇక సినిమా కధలోకి వెళ్లే…

ఇంద్రసభలో ఋషులు శాంతి మంత్రం పఠించాక, ఇంద్రుడు సభను ప్రారంభస్తాడు. సభలో నారదుడు చేసిన మేలును తలచుకుని, సభలో నారదునిపై ఇంద్రుడు కృతజ్ఙతలు చెబుతుండగానే, నారదుడు ఇంద్రసభలోకి ప్రవేశిస్తాడు.

ఇంద్రుడు, నారదమునీంద్రుడనికి ఆహ్వానిస్తాడు. ఆసీనుడైన నారదుడికి ఇంద్రుడు కృతజ్ఙతలు తెలియజేస్తాడు. అంతలో అందరూ నారద మునిని పొగడుతారు. నారదుడుకు కూడా పొంగు ప్రారంభం అవుతుంది.

ఆ సభలోనే ఉన్న బృహస్పతి నారదుడు స్వతంత్రుడు కాడు… నారదుడుని కూడా వెనకలా ఉండే నడిపే శక్తి ఒకటి ఉందని బృహస్పతి పలుకుతాడు. అయితే నారదుడు అంతకు ముందు తాను చేసిన ఘనకార్యములను చెబుతాడు.

ఇంకా త్రిమూర్తులకు, దేవతలకు నేనే సాయం చేశాను అని నారదుడు అంటాడు.. ఆ మాటలను సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు వింటాడు. విని నవ్వుతాడు.

వ్యక్తి జీవితాన్ని సరిదిద్దేది సంసారమే అంటారు.. అలాగే నారదుడుని సంసారంలో దింపి, అతనికి బుద్ది చెప్పాలని శ్రీకృష్ణభగవానుడు నిర్ణయించుకుంటాడు.

ఎప్పటిలాగానే నారదుడు ఆకాశగమనంలో గానం చేసుకుంటూ సంచరిస్తూ ఉంటాడు… శ్రీకృష్ణభగవానుడు, సత్యభామలు ఒక వానప్రస్థులుగా మారి, అడవిలో ఆశ్రమం ఏర్పరచుకుని ఉంటారు.

నారదుడు జ్ఙానం కోల్పోవుట… శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ

నారదుడు ఆ ఆశ్రమమునకు వెళతాడు. అక్కడికి వచ్చిన నారదుడు ఆఋషి దంపతులతో తన గొప్పలు తానే చెప్పుకోవడం మొదలు పెడతాడు. సంసారం మాయ అని దానిలో కొట్టుకోపోవద్దని ఆ ఋషిదంపతులకు చెబుతాడు. అలా ఆ మాటలలో…

”సంసారం నుండి క్షణాలలో బయటపడగలనని” అంటాడు….నారదడు…

ఇక శ్రీకృష్ణుడు నారదుని జ్ఙానాన్ని గ్రహిస్తాడు. నారదుడు అచేతనంగా నేలకొరుగుతాడు.

ఎంతవారుగానీ మాయకు దాసులే, ఎంతవారుగానీ అహంకరిస్తే, గర్వభంగ తప్పదని శ్రీకృష్ణ భాగవానుడు సత్యభామతో తెలియజేస్తాడు…

తన తేజస్సుని కోల్పోయి నడకసాగిస్తున్న నారదునికి ఒక జంట కనబబడుతుంది… ఆయువజంట వైనం చూసిన నారదుడి మనసు గతి తప్పుతుంది.

శ్రీకృష్ణమందిరంలో శ్రీకృష్ణుడికే తన మదిగతిని తెలియజేస్తాడు, నారదమహర్షి…. ఇక శ్రీకృష్ణభగవానుడి సలహాతో నారదుడు కాంతకోసం ద్వారకలో శోధనచేయడం మొదలుపెడతాడు.

ద్వారకా నగరంలో నారదుని కంటికి కనబడే ప్రతి కాంత దగ్గర కృష్ణభగవానుడి దర్శనమే కనబడుతుంది…

శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ
శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ

నారదుడు తనదగ్గరి మహతిని శ్రీకృష్ణుడి చేతికిచ్చి, తను నదీ స్నానమునకు వెళతాడు. నారదుడు నదిలో మనగగానే, శ్రీకష్ణుడు నారదుని మహతిని ఒక కన్నెపిల్లగా మార్చి అంతర్ధానం అవుతాడు.

నదీస్నానం చేసిన నారదుడు నది నుండి బయటకు రాగానే తన కంటబడిన కోయయువతివైపు దారితీస్తాడు. ఆమెను కలసుకుని ఆమె పేరు ”మాయ” అని తెలుసుకుంటాడు.

తదుపరి నారదుడుకు మాయతో వివాహం జరుగుతుంది. వారికి గంపెడు పిల్లలు పుట్టడం జరిగిపోతుంది. ఇక అక్కడి నుండి నారదమహర్షికి సంసార బాధలు మొదలవుతాయి…

చివరికి నారద మహర్షి సంసారం గొప్పతనం తెలసుకుంటాడు. తన తప్పు తెలుసుకుంటాడు.. అహంకారం విడిచిన నారద మహర్షిని శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహిస్తాడు… తిరిగి తన యధాస్థితికి నారదమహర్షి వెళ్లడంతో శ్రీకృష్ణ మాయ మూవీ కధ సుఖాంతం అవుతుంది.

ఈ శ్రీకృష్ణ మాయ మూవీలో నారదుడుగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. సంసారంలో నారదుడి భార్య (మాయ)గా జమున నటించారు. ఇంకా కె.రఘురామయ్య శ్రీ కృష్ణుడుగా నటించారు.

ఇంద్రుడుగా రాజనాల నటించారు. దుర్గమ్మగా ఛాయదేవి నటించారు… ఇంకా ఇతర నటీనటులు నటించిన శ్రీకృష్ణమాయ మూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు.

తప్పక చూడదగిన తెలుగుమూవీలలో శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ కూడా ఒక్కటి… ఈ సినిమా యూట్యూబ్ ద్వారా వీక్షించడానికి ఈ అక్షరాలను టచ్ చేయండి.

తెలుగురీడ్స్ బ్లాగ్

తెలుగురీడ్స్ హోమ్