భిన్నమైన రీతిలో క్లైమాక్స్ గల

భిన్నమైన రీతిలో క్లైమాక్స్ గల సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా సహజంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితుల ఆధారంగా కధనం కలిగి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా నిదానంగా పెద్ద హిట్టు అయింది. ఈ సినిమా క్లైమాక్స్ విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో సినిమా కూడా భిన్నమైన క్లైమాక్స్ కలిగి ఉందని అంటున్నారు.

ఉప్పెన సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే పెద్ద టాక్. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుండి మరో వారసుడు పరిచయం అవుతున్నాడు. ఈయన హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, పేరు వైష్ణవ్ తేజ్ పంజా. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఉప్పెన సినిమాను నిర్మించారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. వాలెంటైన్స్ డే వీకెండ్ సందర్భంగా ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఎక్కువగా అన్ని సినిమాల్లో సుఖాంతం చూస్తాం.. కానీ ఉప్పెన సినిమాలో మాత్రం విషాదాంతం చూస్తామని మాట్లాడుతూ ఉంటే, టీజర్ చూసిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. ఉప్పెన సినిమా ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అవగాహన ఏర్పడుతుంది. గొప్ప గొప్ప ప్రేమ కథ చరిత్రలో ఉండాలి కానీ పెళ్లి చేసుకొని ఇంట్లో పిల్లాపాపలతో కాదు అంటూ విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ వింటుంటే ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *